కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ.. మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

by Mahesh |
కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ.. మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (coalition government) అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు మాజి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు నమోదు (Registration of cases) చేసి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో మాజీ మంత్రి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో కోట్ల విలువైన క్వార్ట్జ్ (Quartz) దోపిడీ చేశారని ఆరోపణలు రావడంతో మాజీ మంత్రి కాకాణి (Former Minister Kakani) సహా ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తు మైన్స్ లీజు ముగిసినప్పటికీ అక్రమంగా క్వార్ట్జ్ తరలించారని అతనిపై ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనపై 120బి, 447,427, 379, 220, 506 129 తో పాటు ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి.. ఇందులో మాజీ మంత్రి కాకాణిని ఏ4గా చేర్చారు.

Advertisement
Next Story

Most Viewed