దర్శకుడిగా మారుతున్న స్టార్ హీరో.. ఆ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ కోసమేనంటూ పోస్ట్

by Hamsa |
దర్శకుడిగా మారుతున్న స్టార్ హీరో.. ఆ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ కోసమేనంటూ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ఏడాది ఒక సినిమా చొప్పున చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే గత ఏడాది ఆయన ‘ఫైటర్’(Fighter) మూవీతో వచ్చాడు కానీ బాక్సాఫీసు వద్ద హిట్ సాధించలేకపోయారు. ప్రస్తుతం ఆయన ‘వార్-2’(War-2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటింస్తుండగా.. అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే హృతిక్ రోషన్ ‘క్రిష్’ సినిమా సీక్వెల్‌లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే దీనికి రాకేష్ రోషన్ దర్శకత్వం వహిస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ‘క్రిష్-4’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. హృతిక్ రోషన్ దర్శకుడిగా మారినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై ఆయన తండ్రి రాకేష్ రోషన్(Rakesh Roshan) ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘25 ఏళ్ల క్రితం నిన్ను యాక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేశాను.

ఇప్పుడు మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఆదిత్యచోప్రా(Aditya Chopra)తో, నేను కలిసి నిన్ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నాం. దర్శకుడిగానూ నువ్వు ఎన్నో విజయాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకమైన ‘క్రిష్-4’ సినిమాకు నువ్వు దర్శకత్వం వహించడం చాలా ఆనందంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు. అలాగే క్రిష్-4 రాబోతున్నట్లు చెప్పడంతో అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story