‘ఆ విషయంలో నాకు స్వార్థమే’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-03-28 10:07:53.0  )
‘ఆ విషయంలో నాకు స్వార్థమే’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఐఐటీ మద్రాస్‌లో జరుగుతున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, వారిలోనూ తెలుగువారు ముందుండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో తెలుగువారు దూసుకెళ్లాలి అనేది నా స్వార్థం. దీని కోసం అమరావతి(Amarawati)లో క్వాంటమ్ వాలీని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.

అందులోనే అన్ని సాంకేతికతలను ఏర్పాటు చేస్తాం. భారత ప్రభుత్వంతో పాటు ఐఐటీ మద్రాస్, IBM, TCS, ఎల్‌అండ్‌టీతో కలిసి పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటిది తీసుకురావడం దేశంలోనే మొదటిసారి అని వెల్లడించారు. ఈ తరుణంలో మొదటిసారిగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కలుస్తానని కోరినప్పుడు అతను ఇష్టపడలేదని సీఎం చంద్రబాబు తెలిపారు.

రాజకీయ నాయకులతో తనకు పని లేదని ఆయన అన్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఒప్పించి 45 నిమిషాలు మాట్లాడినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్‌(Hyderabad)కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు. మనమంతా కృషి చేస్తే భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని అన్నారు. 2027 నాటికి మూడో స్థానం, 2047 నాటికి అగ్ర దేశంగా అవతరిస్తుందని సీఎం పేర్కొన్నారు.

Next Story

Most Viewed