Global Star: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్ ఏంటో తెలిస్తే షాక్?

by Anjali |
Global Star: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్ ఏంటో తెలిస్తే షాక్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియన్ నటుడు, పద్మవిభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మొదట్లో ఈ నటుడి సినిమాలు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయినా.. తర్వాత చరణ్ నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరోల్లో రామ్ చరణ్ ఒకరు అని చెప్పుకోవచ్చు.

ఈ హీరో మొదట చిరుత చిత్రంలో నటించి మెప్పించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. బ్లాక్ బస్టర్ హిట్‌‌గా నిలిచింది. ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా - దక్షిణాది అవార్డును గెలుచుకుంది. తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ఫాంటసీ యాక్షన్ చిత్రం మగధీరలో నటించి ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు.

అత్యధిక వసూళ్లు సాధించిన ఈ సినిమాతో పాటు ఆరెంజ్, రచ్చ, నాయక్(Nayak), ఎవడు, గోవిందుడు అందరివాడేలే, ధ్రువ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అన్యోన్యమైన దంపతులకు ఏకంగా పదకొండేళ్లకు పండంటి ఆడబిడ్డ జన్మించింది.

ఇకపోతే సెలబ్రిటీల గురించి ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఓ న్యూస్ ట్రెండ్ అవుతోంది. అయితే సాధారణంగా పెళ్లైన వారు తమ పిల్లలదో లేక తల్లిదండ్రులదో, భార్యలదో పెట్టుకుంటారు. కానీ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏ వాల్ పేపర్ పెట్టుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు. తనకు ఇష్టమైన హనుమాన్ ఫొటోను చరణ్ ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకున్నాడని నెట్టింట టాక్ నడుస్తోంది.

Next Story

Most Viewed