ప్రియుడితో కలిసి బెంజ్ కారును కొన్న విరూపాక్ష బ్యూటీ.. అబ్బో అమ్మడు రేంజ్ మామూలుగా లేదంటున్న నెటిజన్లు

by Kavitha |   ( Updated:2025-03-25 03:48:56.0  )
ప్రియుడితో కలిసి బెంజ్ కారును కొన్న విరూపాక్ష బ్యూటీ.. అబ్బో అమ్మడు రేంజ్ మామూలుగా లేదంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘విరూపాక్ష’(Virupaksha) సినిమాలో నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్న సోనియా సింగ్(Sonia Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ షార్ట్ ఫిల్మ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ‘న్యూ ఏజ్ గర్ల్ ఫ్రెండ్’(New Age Girlfriend), ‘నాన్ తెలుగు గర్ల్ ఫ్రెండ్’(Non Telugu Girlfriend) వంటి షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఈ భామకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), సంయుక్త మీనన్(Samyuktha Menon) జంటగా నటించిన ‘విరూపాక్ష’ మూవీలో నటించే చాన్స్ కొట్టేసింది.

ఇక ఈ సినిమాలో ఈ భామదే మెయిన్ రోల్ అన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ‘యమలీల’(Yamaleela) సీరియల్‌లో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి సిద్ధు పవన్‌(Sidhu Pawan)తో కలిసి ‘ఢీ’(Dhee Dance Show) షోలో టీమ్ లీడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో చేజేతులా సంపాదిస్తోంది సోనియా సింగ్. ఈ క్రమంలోనే మెర్సిడెజ్ బెంజ్ సీ క్లాస్ కారును కొనుగోలు చేసింది.

తన కుటుంబ సభ్యులు, ప్రియుడుతో కలిసి షోరూమ్‌కు వచ్చిన ఆమె తన డ్రీమ్ కారుని తీసుకుంది.ఈ సందర్భంగా అక్కడే తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్ధు, తన ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. అనంతరం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారులో సిద్ధుతో ఫస్ట్ డ్రైవ్‌కి వెళ్ళింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. వీటిని చూసిన నెటిజన్లు అమ్మో అమ్మడు రేంజ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More..

విడాకుల కోసం భార్యతో కోర్టు మెట్లెక్కిన స్టార్ డైరెక్టర్.. షాక్‌లో నెటిజన్లు (వీడియో)


Next Story