- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Anupama Parameswaran: ‘పరదా’ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ విడుదల

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘ప్రేమమ్’(Premam) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడు క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో అనుపమకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక తెలుగులో ‘అఆ’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత శతమానం భవతి(Shatamanam Bhavati), కార్తికేయ(Kartikeya), హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమాలతో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఇటీవల అనుపమ ‘డ్రాగన్’(Dragon) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చి బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’(Paradha) సినిమాలో నటిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న రాబోతుండగా.. ఇందేలో సంగీత, దర్శన్ రాజేంద్రన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘పరదా’ చిత్రం ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రం మార్చి 28న థియేటర్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో హైప్ పెంచుతున్నారు. తాజాగా, అనుపమ పరమేశ్వరన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘పరదా’ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ‘‘మా అందాల సిరి’’ సాంగ్ మార్చి 23వ తేదీన సాయంత్రం 7 గంటలకు రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె లంగా వోణి ధరించి సాంప్రదాయ లుక్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.
Read More..
Ananya Nagalla: దయచేసి అందరూ నన్ను క్షమించండి.. తప్పు చేశానంటూ ఎమోషనల్ పోస్ట్