- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL 2025 : రోహిత్ డకౌట్.. చెత్త రికార్డు మూటగట్టుకున్న హిట్‌మ్యాన్

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ , స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో భాగంగా చెన్నయ్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అయితే, ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఓవర్‌లోనే డకౌటయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఖలీల్ అహ్మద్ వేసిన బౌలింగ్‌లో శివమ్ దూబెకు క్యాచ్ ఇచ్చాడు. డకౌటవ్వడంతో హిట్‌మ్యాన్ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్ల జాబితాలో చేరాడు. ఐపీఎల్‌లో రోహిత్ డకౌటవడం ఇది 18వ సారి. మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ కూడా అన్నే సార్లు డకౌటవ్వగా.. వారితో కలిసి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. పీయూశ్ చావ్లా, సునీల్ నరైనా 16 సార్లు పరుగుల ఖాతా తెరవకుండానే అవుటయ్యారు.