- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అప్పుల కోసం కోటి పాట్లు.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ బాబు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు (Budget meetings) 10వ రోజు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు (BJP MLA Palvai Harish Babu) మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడును రోల్ మోడల్ గా తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం.. వారు పాటించిన విధానాలను ఫాలో అవ్వడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖర్చు కంటే.. బడ్జెట్ అంచనా 20 శాతం అధికంగా నిర్ణయించారని గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలానే చేసిందని గుర్తు చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఘన్ పూర్ సభలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ (Real estate) వ్యవస్థ కుదేలైంది అని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని, రైతులకు గ్రామాల్లో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే హరీష్ బాబు అన్నారు. అలాగే ఇండ్ల అమ్మకాలు హైదరాబాద్ లో 40 శాతానికి పైగా పడిపోయాయని అన్నారు. రాష్ట్రంలో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి రోజువారీ కూలీ దొరకడం లేదని, దీనికి రియల్ ఎస్టేట్ పడిపోవడం కారణం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అప్పులే ప్రధాన ఆదాయంగా మారిపోయాయని.. వాటి వల్ల రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, భవిష్యత్తులో ఈ పరిస్థితి దారుణంగా మారుతుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ గైడ్ లైన్ కంటే అధికంగా ఓవర్ డ్రాఫ్ట్ (Over draft) ద్వారా అప్పులను తీసుకుంటుంది.. ఈ అప్పులు కూడా సరిపోగా నగరంలో ఉన్న విలువైన భూములను అమ్మాలని చూస్తున్నారని ఇందులో భాగంగానే గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ 400 ఎకరాలు మహానగరానికి బ్రీతింగ్ స్సేస్.. అని, నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న క్రమంలో.. 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలని.. అందులో వేలాది పక్షులు, నెమళ్ళు, జింకలు, ఉన్నాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
ఈ క్రమంలో గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే సూచించారు. అయితే కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు.. అప్పు కోసం కోటి విద్యలు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి తయారైందని, రోజు వారి పాలన కోసం కూడా ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్పుకొచ్చారు.