- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Assembly: ఆ కాన్సెప్ట్‌తో వచ్చే ఎన్నికలకు వెళ్తాం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల్లో భాగంగా ఇవాళ సభలో ధరణి (Dharani), భూభారతి (Bhubharati)పై చర్చ ఆసక్తికంగా కొనసాగుతోంది. అధికార, విపక్ష నేతల పరస్పర ఆరోపణలతో సభ దద్దరిల్లింది. ఈ క్రమంలనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ప్రవేశపెట్టిన ‘ధరణి’ (Dharani) బాగుందో.. లేదో అన్న విషయంపై ఇప్పటికే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పూర్తి స్పష్టత వచ్చిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ధరణిని అజెండాగా తీసుకుని ముందుకు వెళ్తూనే.. భూభారతి (Bhubharati) కాన్సెప్ట్‌తో ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు.
ధరణిలో జరిగిన అక్రమాలు, అన్యాయాలను పల్లా రాజేశ్వర్ రెడ్డి (Pall Rajeshwar Reddy) కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) తప్పు చేసింది కాబట్టే.. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని కామెంట్ చేశారు. అదేవిధంగా వీఆర్ఏ (VRA), వీఆర్వో (VROS)లపై గత సర్కార్ ఎలా ప్రేమ చూపించిందో అందరికీ తెలుసని.. కొత్తగా వాళ్ల భవిష్యత్తు, అభ్యున్నతిపై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వీఆర్ఏ (VRA's)లు కావాలని ప్రజలే అడుగుతున్నారని.. ఆ వ్యవస్థను మళ్లీ త్వరలోనే తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ విషయంలో బీఆర్ఎస్ (BRS) నేతలు కట్టుకథలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో వీఆర్ఏ, వీఆర్వోలకు ప్రత్యేక గౌరవం ఇస్తామని మంత్రి పొంగులేటి అన్నారు.