సూర్యాపేట జిల్లా పోలీసుల పై వేటు.. అసలు కారణం అదే..

by Sumithra |
సూర్యాపేట జిల్లా పోలీసుల పై వేటు.. అసలు కారణం అదే..
X

దిశ, సూర్యాపేట : నూతనకల్ మండలం మిరియాల గ్రామంలో మెంచు చక్రయ్య గౌడ్ మర్డర్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సూర్యాపేట డీఎస్పీ రవి పై వేటు వేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని సమాచారం. మెంచు చక్రయ్య గౌడ్ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని, హత్యకు ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చిన ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించారని సూర్యాపేట డీఎస్పీ రవిని డీజీపీ కార్యాలయానికి, తుంగతుర్తి సీఐ శీనును జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారని సమాచారం. స్థానిక ఎస్సై మహేంద్ర నాథ్ కి మెమో అందించనున్నారు. లాండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఇప్పటికే ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. ఇంకా ఈ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగిస్తుందని ఐజీ అన్నారు.

Next Story