- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Air India: ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి కొత్త విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా చర్చలు

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ఇండియా మరోసారి భారీగా విమానాలను ఆర్డర్ చేసింది. బోయింగ్‌తో పాటు ఎయిర్‌బస్ కంపెనీలకు చెందిన వైడ్‌బాడీ ఫ్లైట్‌ల కోసం బిలియన్ డాలర్ల ఖర్చు చేయనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందులో ఎయిర్‌బస్‌కు చెందిన ఏ350, బోయింగ్ 777ఎక్స్ మోడల్ విమానాలు ఉన్నాయని, కనీసం 30-40 విమానాల కోసం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి కొనుగోలు విషయమై ఎయిర్ఇండియా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఎయిర్‌బస్, బోయింగ్ కంపెనీలను సంప్రదించగా స్పందించలేదు. ఈ ఏడాది జూన్‌లో జరిగే ప్యారిస్ ఎయిర్‌షోలో దీనిపై స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ 20230లో 470 విమానాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది కూడా మరో 100 ఎయిర్‌బస్ విమానాల కోసం ఒప్పందం చేసుకుంది. అయితే ఇవన్నీ నారో-బాడీ విమానాలు. తాజా వైడ్-బాడీ విమానాల ఒప్పందం ద్వారా అంతర్జాతీయ విమానయాన కంపెనీలతో పోటీ ద్వార మార్కెట్ వాటాను తిరిగి పొందాలని ఎయిర్ఇండియా భావిస్తోంది. ఈ ఒప్పందంలో 50 ఎయిర్‌బస్ ఏ350, 10 బోయింగ్ 777ఎక్స్, 20 787 డ్రీమ్‌లైనర్‌లు ఉన్నాయని సమాచారం.