రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికి కీలక పిలుపునిచ్చిన కేటీఆర్

by Mahesh |   ( Updated:2025-03-27 09:19:07.0  )
రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికి కీలక పిలుపునిచ్చిన కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు (Budget meetings) ఈ రోజు చివరి రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సభలో 2023-2024 కాగ్ నివేదిక, అవయవ దానం, డీలిమిటేషన్ పై తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో అవయవ దానం (Organ donation) బిల్లుపై సభలో చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తు కేటీఆర్ (KTR) కీలక పిలుపునిచ్చారు. అవయవదానానికి తన వంతుగా కేటీఆర్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యుల తరఫున తాను మాట్లాడలేనని, కానీ ఓ వ్యక్తిగా తాను అవయవదానానికి మద్దతుగా నిలుస్తానని అన్నారు. ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లోని రెండు, మూడు లక్షల మంది ఓటర్లకు, ప్రజలకు ప్రతినిధులమని, అసెంబ్లీలోనే ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమం చేపట్టి, రాష్ట్ర పౌరులకు మనం ఆదర్శంగా నిలుద్దామని.. అలా చేస్తే.. తానే ముందుండి మొదట అవయవదానం (organ donation) చేసేందుకు సంతకం పెడతానని, అదే బాటలో ఎమ్మెల్యు నిలవాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed