- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Humanoid Robot : వావ్.. వాట్ ఏ స్కిల్స్..! వర్క్ ఫోర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హ్యూమనాయిడ్ రోబోట్ (వీడియో)

దిశ, ఫీచర్స్ : ‘ఇనుములో ఓ హృదయం మొలిచెనే..’ అన్నాడో సినీ కవి. ఆధునిక సాంకేతిక రంగంలో ఇది నిజంగానే కళ్లకు కడుతున్నది. లోహాల్లో హృదయాలు మొలవడమే కాదు, రాబోయే రోజుల్లో మనుషుల్లా మానవత్వాలు సైతం పరిమళిస్తాయంటున్నారు సాంకేతిక నిపుణులు. హ్యుమనాయిడ్ రోబోట్స్ అందుబాటులోకి రావడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు.
మోడర్న్ టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం వరల్డ్‌వైడ్‌గా అనేక రంగాల్లో ఏఐ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల అందుబాటులోకి వస్తున్న హ్యూమనాయిడ్ రోబోట్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. మానవాళి జీవితాన్ని సౌకర్యవంతం చేస్తున్నాయి. వంట చేయడం, ఇల్లు సర్దడం మొదలుకొని.. వ్యక్తిగత విషయాల్లోనూ సహాయం చేస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడిప్పుడే ఏఐ ఆధారిత (AI based) ఇండస్ట్రీయల్ రోబోట్స్ సైతం ఎంట్రీ ఇస్తు్న్నాయి. వర్క్ ఫోర్స్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో సమాచారం ప్రకారం.. చైనాలోని బిగ్గెస్ట్ సిటీ షాంఘైలో వర్క్ ఫోర్స్‌లోకి ప్రవేశ పెట్టే ఉద్దేశంతో ‘ఏఐ ఇంటర్న్ ’ పేరుతో రోబోట్స్‌కు శిక్షణ ఇస్తున్నారు. కాగా రీసెంట్‌గా మొదటి బ్యాచ్ ట్రైనింగ్ నుంచి తొలిసారిగా ఓ హ్యుమనాయిడ్ రోబోట్(Humanoid robot) వర్క్ ఫోర్స్‌లోకి ప్రవేశించింది (Entered the work force). ఇది సంప్రదాయ ఇండస్ట్రీయల్ రోబోట్‌లా కాకుండా మల్టిపుల్ వర్క్ (Multiple work) చేసేలా తయారు చేశారు. ఇది కొత్త ఫ్యాక్టరీలోకి ప్రవేశించగానే కాటన్ డబ్బాలను, వస్తువులను ఎత్తడం, సర్దడం చేస్తున్నది. అలాగే షాపింగ్ మాల్‌లో వస్తువులను సక్రమంగా ఉంచడం, యజమానికి అందించడం, క్యూఆర్ కోడ్‌లు (QR codes) స్కాన్ చేయడం వంటివి చేస్తు్న్నది. ప్రస్తుతం ఇలా ఏవో కొన్ని పనులే కాదు, అనేక పనులను మనుషుల్లా చేస్తున్న ఈ హ్యూమనాయిడ్ రోబోట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
This Video credits go to Ndtv world insta Id