Nara Lokesh:ఒక్క మెసేజ్.. క్షణాల్లో స్పందించిన మంత్రి.. సొంత ఖర్చుతో విమానం ఏర్పాటు.. విషయమేంటంటే?

by Jakkula Mamatha |
Nara Lokesh:ఒక్క మెసేజ్..  క్షణాల్లో స్పందించిన మంత్రి.. సొంత ఖర్చుతో విమానం ఏర్పాటు.. విషయమేంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఎప్పూడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి లోకేష్ ఎవరికి ఏ ఆపద వచ్చిన ఒక్క మెసేజ్ చేస్తే చాలు క్షణాల్లోనే స్పందించారు. ఈ క్రమంలో తాజాగా సకాలంలో స్పందించడం వల్ల.. ఒకరి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం జరగనుంది.

మంత్రి లోకేష్ సొంత ఖర్చులతో గుండె తరలింపునకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. అంతేకాదు గ్రీన్ ఛానల్‌కు మార్గం సుగమం చేసిన మంత్రి నారా లోకేష్‌కు ఆయా కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పిటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు రమేష్ హాస్పిటల్‌లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్ అయ్యారు. జీవచ్ఛవంలా మారిన తమ ఇంటి వెలుగు సుష్మ మరణం సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.

ఆమె అవయవదానానికి అంగీకరించారు. వెంటనే రమేష్ హాస్పిటల్స్ గుంటూరు వైద్యులు ఆగమేఘాలపై అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్ కు ఒక్క మెసేజ్ పంపారు. క్షణాల్లో స్పందించిన మంత్రి గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు, తిరుపతి ఆస్పత్రికి గుండె చేరేవరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. అసాధ్యం అనుకున్న పని ప్రత్యేక విమానం సొంత ఖర్చుతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేయడంతో సుసాధ్యం అయింది. దీంతో గుండె మార్పిడి విజయవంతం చేసేందుకు వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకున్నారు.

Next Story