- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Trending: లోక్‌సభలో రాహుల్ గాంధీ అనుచిత ప్రవర్తన.. స్పీకర్ ఓం బిర్లా సీరియస్

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ (Lok Sabha)లో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనుచిత ప్రవర్తనపై స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) సీరియస్ అయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా (Social Media)లోనూ తెగ చక్కర్లు కొడుతోంది. అసలు విషయంలోకి వెళితే.. బుధవారం రాహుల్ గాంధీ లోక్‌సభలోకి ఎంటర్ అవుతోన్న క్రమంలో చెల్లి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) తన సీట్లో కూర్చొని ఉంది. అయితే, రాహుల్, ప్రియాంక వద్దకు వెళ్లి ఆమె బుగ్గలను నిమురుతూ అప్యాయంగా పలుకరించారు. అది చూసిన స్పీకర్ ఓం బిర్లా, రాహుల్ ప్రవర్తనే మండిపడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలంతా సభా సంప్రదాయాలను పాటించాల్సిందేనని అన్నారు. సభలో ఎలా ప్రవర్తించాలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. అది తల్లీకూతుళ్లు, తండ్రీకూతుళ్లు, భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్లు అయినా.. అందరికీ ఒకే రూల్ వర్తిస్తుందని ఓం బిర్లా కామెంట్ చేశారు.