Quinton de Kock: చెలరేగిన డీకాక్.. ఐపీఎల్‌లో 11 ఏళ్ల నాటి రికార్డు బద్దలు

by Shiva |   ( Updated:2025-03-27 09:09:14.0  )
Quinton de Kock: చెలరేగిన డీకాక్.. ఐపీఎల్‌లో 11 ఏళ్ల నాటి రికార్డు బద్దలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2025 (IPL-2025)లో బౌలర్లపై బ్యాట్స్‌మెన్లు పగబట్టినట్లుగా పరుగుల వరద పారిస్తున్నారు. బుధవారం రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కేకేఆర్ జట్టులో ఓపెనర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) ఏకంగా 67 బంతుల్లో 97 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అందులో 8 ఫోర్లు 6 సిక్సులు ఉన్నాయి.

అయితే, ఈ మ్యాచ్‌లో డికాక్ సెంచరీ మిస్ అయినా.. ఐపీఎల్ లీగ్‌లో 2014 ఫైనల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మనీష్ పాండే (Manish Pandey) నెలకొల్పిన లాంగ్ ఇన్సింగ్స్ 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం క్వింటన్ డికాక్ (Quinton de Kock) కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున పరుగుల వేటలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2014 ఫైనల్‌లో మనీష్ పాండే 94 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్ (KKR) రెండో టైటిల్ ఎగిరేసుకుపోయింది. ప్రస్తుతం అదే రికార్డు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ వశమైంది.



Next Story

Most Viewed