- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గొర్రెల మందకు కాపలాగా ఉంటే ఇంత పని చేస్తారా

దిశ, ఇబ్రహీంపట్నం : గుర్తుతెలియని ఎనిమిది మంది దుండగులు గొర్రెల మందకు కాపలాగా ఉన్న వ్యక్తి పై దాడి చేసి 40 గొర్రెలను ఎత్తుకెళ్లిన ఘటన అబ్దులాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడ గ్రామంలో ఎనిమిది మంది గుర్తు తెలియని దుండగులు గొర్రెల మందకు కాపలాగా ఉన్న కోహెడ గ్రామానికి చెందిన రాసురి నవీన్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.
అలాగే అతని బావమరిది రావుల శ్రీకాంత్ తో కలిసి ఆదివారం రాత్రి తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా.. వీరిద్దరూ గొర్రెల మందకు కాపలాగా ఉన్నారు. అయితే సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎనిమిది మంది దుండగులు గొర్రెల మంద పై దాడి చేయగా రాసురి నవీన్, రావుల శ్రీకాంత్ లు వారిని ప్రతిఘటించగా దానిలో రాసురి నవీన్ ను కత్తులతో తీవ్రంగా గాయపరచి.. తమ వెంట తెచ్చుకున్న వాహనంలో 40 గొర్రెలను దొంగలించుకుపోయారు.. ఈ దాడిలో రాసురి నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు ఆయనను ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్ కు తరలించారు. కాగా వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.