అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న నటి.. వెకేషన్‌కు వెళ్లడానికి సిగ్గుండాలంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు..

by Kavitha |
అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న నటి..  వెకేషన్‌కు వెళ్లడానికి సిగ్గుండాలంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ రష్మీ(Rashmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ బిగినింగ్‌లో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. దీంతో ఈ భామకు హీరోయిన్‌గా కూడా అవకాశాలు వచ్చాయి. కానీ అనుకున్నంతగా రాణించలేకపోయింది. దీంతో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో(Jabardasth Show)కు యాంకర్‌గా సెట్ అయిపోయింది. అక్కడ తనకు వచ్చీ రానీ తెలుగుతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయింది. ఇక కమెడియన్ సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer)తో రీల్ ప్రేమాయణం నడిపి మరింత ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ‘జబర్దస్త్ షో’తో పాటు ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’(Sridevi Drama Company)కి యాంకరింగ్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. తాాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బాలీలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘ఎన్నో సాహసాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం ఈ వెకేషన్‌ను ప్లాన్‌ చేశా. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. నిద్రపోవడం, నచ్చిన ఫుడ్‌ తినడంతోనే ఈ టూర్‌ గడుస్తోంది. జీవితంలో కొత్త విషయాలను నేర్పించడానికి దేవుడు ఇలా వింతైన మార్గాలు ఎంచుకుంటాడని అనిపిస్తోంది’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ ఫొటోస్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక వాటిని చూసిన కొందరు నెటిజన్లు ఈ టాలీవుడ్ యాంకరమ్మను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. పహల్గామ్ దాడి ఘటనతో దేశమంతా విషాదంలో ఉంటే వెకేషన్‌కు వెళ్లడానికి సిగ్గుండాలి.. ఆఫ్ట్రాల్ మూగ జీవాలకు ఏమైనా జరిగితే సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతావు అలాంటిది ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోతే ఏమి పట్టనట్టు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తావా అని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed