నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఈ పోస్టుల దరఖాస్తుకు రేపే చివరి తేదీ!

by Jakkula Mamatha |   ( Updated:2025-03-20 13:00:27.0  )
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఈ పోస్టుల దరఖాస్తుకు రేపే చివరి తేదీ!
X

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖకు సంబందించిన ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్(IPPB) నుంచి 51 ఎగ్జిక్యూటివ్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుంచి డిగ్రీ అర్హత కలిగి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సంబంధించిన రాష్ట్రాలలో పోస్టింగ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు 03 సంవత్సరాలు కాంట్రాక్టు పద్ధతిలో పని చెయ్యాలి. ఈ నెల 1వ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

అర్హతలు..

*విద్యార్హత: ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

*దరఖాస్తుకు చివరి తేదీ: 21st మార్చి 2025

*దరఖాస్తు ఫీజు: SC, ST, PWD వారు ₹150/- , మిగిలిన అభ్యర్థులు ₹750/- ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇతర వేరే విధానంలో Apply చేసినవారి దరఖాస్తులు అంగీకరించబడదు.

*వయోపరిమితి: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ ఉన్న SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాలు వయోపరిమితి మినహాయింపు ఉంటుంది.

*శాలరీ: పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹30,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర ట్రావెల్ అలవెన్సులు, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.

*అప్లికేషన్స్‌కి అధికారిక వెబ్‌సైట్ https://www.ippbonline.com/web/ippb/current-openings ను సందర్శించండి.

Next Story