- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మైనర్ బాలిక మృతికి కారణమైన వ్యక్తి రిమాండ్
by Sridhar Babu |

X
దిశ,పెగడపల్లి : ప్రేమ పేరుతో వేధించి మైనర్ బాలిక మృతికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు ఎస్సై రవి కిరణ్ తెలిపారు. ఎస్సై రవి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాం భద్రునిపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన బాస రాము, గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రేమ పేరుతో వేధించగా వేధింపులు తాళలేక బాలిక ఈ నెల 15న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం కరీంనగర్ ఆసుపత్రిలో మరణించింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై గురువారం బాస రామును అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.
Next Story