- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ సినిమా చూసి నన్ను అందరూ తిట్టుకుంటారు.. మిల్క్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamannah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటిస్తోంది. ఇది సూపర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్’(Railway Station)కు సీక్వెల్‌గా వస్తున్న మూవీ. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్(Teaser) మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. అయితే నిన్న ఓదెల-2 మూవీ రిలీజ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. ‘నన్ను చాలా మంది తెలుగు అమ్మాయి అనుకుంటారు.
నేను కూడా దానికి చాలా సంతోషిస్తాను. ఎందుకంటే నాకు ఏదైన ఎమోషన్ వస్తే కచ్చితంగా తెలుగులోనే దాన్ని చూసినస్తాను. కోపం వచ్చినా సరే తెలుగులోనే తిడతాను. అందుకే నాకు తెలుగు లాంగ్వేజ్ అంటే అంత ఇష్టం. అలాగే ఓదెల-2 మీ అందరికీ నచ్చేలా తీశాము. కచ్చితంగా అందరూ నన్ను చూసి తిట్టుకుంటారు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో మొన్నటి వరకు పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట తాజాగా బ్రేకప్ చెప్పుకున్నారని, ఒకరి ఫొటోలు మరొకరు డిలీట్ చేసుకున్నారని చాలా రూమర్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే వీటిపై వీరిద్దరూ స్పందించకపోవడం గమనార్హం. అలాగే మరోపక్క ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేస్తూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది.