- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నగరపాలక సంస్థ అధికారుల చేతివాటం..

దిశ, బ్యూరో కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు ప్రజల నుంచి ఇంటి పన్నులు ముక్కుపిండి వసూళ్లు చేసి తమ వరకు వచ్చేవరకు మాత్రం మరోలా వ్యవహరిస్తూ అక్రమాలకు తెరలేపుతున్నారు. కొలతలు, మెజర్‌మెంట్స్ సామాన్యులకు మాత్రమే అన్నట్టుగా తమకు మాత్రం ఏ మెజర్మెంట్స్ తో పని లేకుండా నామమాత్రపు ఇంటి పన్ను చెల్లించే విధంగా మున్సిపల్ రికార్డుల్లో నమోదు చేసుకుని ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నారు. ఇదేదో క్రింది స్థాయి ఉద్యోగి చిన్నపాటి ఇళ్లు అనుకుంటే పోరపాటే నగర నడిబొడ్డున ఓ ఆపార్టు మెంటులో నివసించే సదరు అధికారిణి వ్యవహరం నగర ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది.
బహుళ అంతస్తుకు భారీ ఆఫర్..
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో కొంతమంది అధికారులు ఇంటి పన్నుల చెల్లింపుల్లో తమ భవంతులకు బహుళ ఆఫర్ ప్రకటించుకున్నారు. వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తాన్ని భారీ మొత్తంలో తగ్గించి నామమాత్రపు చెల్లింపులతో సరిపెట్టుకుంటున్నారు. అత్యంత తక్కువగా ఇంటిపన్ను 1000 రూపాయలు చెల్లించే విధంగా మెజర్మెంట్స్ రికార్డుల్లో నమోదు చేసుకుని ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. వాస్తవంగా నగరంలో 1000 రూపాయల ఇంటి పన్ను అనేది నగర శివారులో ఉన్న చిన్నపాటి పెంకుటిల్లుకు కూడ ఉండదు. అలాంటిది ఓ బహుళ అంతస్తుకు బంఫర్ ఆఫర్ అన్నట్టుగా ఇంటి పన్నులు చెల్లిస్తు నగర ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నారు.
ఇదేదో నగర పాలక సంస్థలో పనిచేసే క్రింది స్థాయి సిబ్బంది అది ఓ పెంకుటిల్లు అని అనుకుంటే పొరపడ్డట్లే అది నగర నడిబోడ్డులో గల బహుళ అంతస్తుల భవనం అయితే 2024 - 25 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుండటంతో ఇంటి పన్నులు, నల్లా పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్దికి సహకరించాలంటు నెల రోజులుగా ఓ వైపు ప్రచారం చేస్తూ మరో వైపు వాడ వాడలా తిరుగుతూ ప్రజల వద్ద నుంచి వసూళ్లు చేస్తున్న అధికారులు తాముమాత్రం అత్యంత తక్కువ చెల్లిస్తు నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా అభివృద్ది చెందింది అంటే సామాన్యుల ఇంటి పన్నులను అడ్డగోలుగా పెంచిన అధికారులు తమకు మాత్రం నామమాత్రపు ఇంటిపన్నులను రికార్డుల్లో నమోదు చేసుకున్న అధికారుల తీరు పై నగర ప్రజలు మండిపడుతున్నారు. సామాన్యులకు ఒకలాగా అధికారులకు మరో లాగా పన్నులు వసూళ్లు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెజర్మెంట్స్ నమోదులోనే మాయాజాలం..
నగరపాలక సంస్థ ఏరియాలను బట్టి ఆయా ఇల్లు భవనాల నిర్మాణాలను పరిగణలోకి తీసుకుని కార్పొరేషన్ అధికారులు ఇంటి పన్నును నిర్ధారణ చేసి ఆన్ లైన్ రికార్డుల్లో నమోదు చేస్తారు. అయితే ఇదంత సహజంగా పారదర్శకంగా సాగుతుందని నగర ప్రజలు విస్వసిస్తారు. కాని అధికారులు మాత్రం నగర ప్రజల విశ్వాసాల పై నీళ్లు చల్లుతూ ఇంటి పన్నుల నమోదులో అవకతవకలకు పాల్పడుతున్నారు. తమ ఇల్లుకు తమకు సంబంధించిన వారి ఇండ్లకు నామమాత్రపు పన్నులను విధిస్తూ చేతివాటం ప్రదర్శించి నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ అక్రమ దందా గత కొద్ది సంవత్సరాలుగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. కార్పొరేషన్ లోకి పోస్టుల్లో ఉన్న అధికారులే కావడం చేత సంవత్సరాల తరబడి పన్నుల చెల్లింపుల్లో నామమాత్రపు చెల్లింపులు చేస్తు పెద్ద మొత్తంలో కార్పొరేషన్ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకుని నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.