- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దారుణం.. తండ్రీ కుతురును గన్‌తో కాల్చి.. తాను ఆత్మహత్య చేసుకున్న యువకుడు

దిశ, వెబ్ డెస్క్: రైల్వే స్టేషన ఫుట్ పాత్ బ్రిడ్జిపై మూడు మృతదేహాలు (Three dead bodies) పడి ఉన్నట్లు కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రైలు ఫుట్ బ్రిడ్జి పై మూడు మృతదేహాలు పడి ఉండటం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనలో ఓ యువకుడు మైనర్ బాలికను ఆమె తండ్రిని తనతో తెచ్చుకున్న గన్ (Gun) తో కాల్చి చంపేశాడు (Killed). అనంతరం అతను గన్ తో కాల్చుకొని ఆత్మహత్య (suicide) చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన బిహార్ (Bihar) లోని ఆరా రైల్వే స్టేషన్ (Aura Railway Station)లో చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకొగా.. మూడు మృతదేహాలు రైల్వే స్టేషన్ (Railway station)లో రక్తపు మడుగులో పడి ఉండటం ప్రయాణికులను భయకంపితులను చేసింది. కాగా ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తుండగా.. పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.