- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీక్రెట్ లైఫ్ ఆఫ్ టీనేజర్స్

టీనేజ్.. కౌమారదశ, యుక్తవయస్సుకు మధ్య ఉన్న ఫేజ్. ప్రయోగాలు, అన్వేషణలతో నిండిపోయే ఎదుగుదల. తమను తాము పరీక్షించుకుంటూ తోటి సమూహంతో కలిసిపోవాలనే ఆత్రుత. తల్లిదండ్రుల నుంచి దూరమవుతున్న సీక్రెట్ గ్రోత్. పేరెంట్స్ నమ్మకాన్ని కోల్పోకుండా.. అలాగని కొత్తగా ట్రై చేయకుండా ఉండలేని అల్లకల్లోల పోరాటం. పాజిటివ్ అయితే పర్ఫెక్ట్, కానీ.. నెగిటివ్ అయితేనే పతనం. ఇంతకీ టీన్ సీక్రెట్ లైఫ్ ఎలా ఉంటుంది?
దిశ, ఫీచర్స్: టీనేజ్ వచ్చాక పిల్లల్లో చాలా మార్పు కనిపిస్తుంది. అప్పటి వరకు తల్లిదండ్రులను ఫాలో అయ్యే వాళ్లు.. ఏదో కొత్తగా చేయాలనే తపనతో ఉంటారు. మానసిక స్వభావం పూర్తిగా మారిపోతుంది. శారీరక మార్పులు కూడా మొదలవుతాయి. హార్మోనల్ చేంజెస్ మనసు, శరీరం రెండింటినీ ప్రభావితం చేస్తూ ఏదో ఒకటి ట్రై చేయమని పురిగొల్పేలా ఉంటుంది పరిస్థితి. ఈ క్రమంలో పేరెంట్స్‌కు తెలియని సీక్రెట్ లైఫ్ నడుస్తుంది. చిన్న చిన్న విషయాలకే సూసైడ్ ఆలోచనలు, సెల్ఫ్ హార్మ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్, సెక్స్, సెక్స్‌టింగ్.. ఇలా అన్నింటిలోనూ తమను తాము పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతారు. ఇవన్నీ బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే తప్ప బయటపడనంతా రహస్య జీవితాన్ని గడిపేస్తారు.
ఇంటర్నెట్ లైఫ్..
ఇంటర్నెట్ మన జీవితాల్లోకి దూసుకొచ్చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక టీనేజర్స్.. అడల్ట్స్‌ను మించిపోయారు. వారి సంబంధాలు, అభిప్రాయాలు, నమ్మకాలకు అనుగుణంగా ఎక్కువ సమయం గడిపేందుకు అలవాటుపడ్డారు. కాబట్టి తల్లిదండ్రులు దానిని ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేరు. నిజానికి కొన్నేళ్ల క్రితం వరకు సెలబ్రిటీలు అంటే యాక్టర్స్ మాత్రమే. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. టీనేజర్స్ కూడా ఓ సెలబ్రిటీ అయిపోవాలని అనుకుంటారు.
ఈ క్రమంలో కొన్ని చేయకూడని పనులు చేస్తారు. లైంగికత గురించి పూర్తిగా అవగాహన చేసుకునే క్రమంలో లింగ పాత్ర వారి గుర్తింపును ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటారు. దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. మీనింగ్‌ఫుల్ రిలేషన్ షిప్స్ ఏర్పరుచుకోవడం, భయంకరమైన వీడియోలు చూస్తా నాకేం కాదు నేను స్ట్రాంగ్ అనుకోవడం, ఆంటీలు లేదా అంకుల్స్‌తో ఇంటిమసీ ఎంజాయ్ చేయడాన్ని ఊహించుకోవడాన్ని ఇష్టపడతారని ఓ పుస్తక రచయిత రాసుకొచ్చాడు.
ఆన్ లైన్ రిలేషన్‌షిప్స్..
ముఖ్యంగా ఆన్ లైన్ రిలేషన్‌షిప్స్ గురించి పేరెంట్స్‌కు తెలియడం అనేది కష్టమే. అయితే ఇవి టీనేజర్ ఎమోషనల్ నీడ్స్‌ను ఫుల్ ఫిల్ చేయొచ్చు. రియల్ వరల్డ్‌లో మీట్ కాలేని ఈ బంధాలు కాస్త ఉపశమనం అందించవచ్చు. కానీ ఒకవేళ కలిస్తే మాత్రం ఒక్కోసారి డేంజర్‌లో పడొచ్చు. అయినా సరే ఈ విషయాలను పిల్లలు తల్లిదండ్రుల నుంచి దాచేస్తారు. అయితే సీక్రెట్ లైఫ్ ఉందనే డౌట్ వచ్చినప్పుడు పేరెంట్స్.. జడ్జ్‌మెంట్‌తో కాకుండా ఇంట్రెస్ట్‌తో పిల్లలను అప్రోచ్ అవ్వాలి. వారు చెప్పేది షాకింగ్‌గా అనిపించినా కోపంతో ఊగిపోకుండా ఆసక్తికరంగా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆ సీక్రెట్ లైఫ్ మెయింటెన్ చేయకుండా ఓపెన్ అవుతారు.
Read More..