- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎంపీ కృష్ణదేవరాయలు కు భద్రత పెంచాలని సూచించిన ఇంటెలిజెన్స్

X
దిశ ప్రతినిధి, నరసరావుపేట: నరసరావుపేట టీడీపీ ఎంపీ, లోక్ సభ టీడీపీ పక్ష నాయకుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు కు భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. శ్రీ కృష్ణ దేవరాయలు వైసీపీ పాలనలో జరిగిన లిక్కర్ స్కాం అక్రమాల గురించి లోక్ సభలో ప్రస్తావించి దేశ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. ఇది వైసీపీ పార్టీ నేతలకు దిమ్మతిరిగేలా చేసింది. దీంతో శ్రీ కృష్ణ దేవరాయలుపై వైసీపీ శ్రేణులను కొందరు నాయకులు రెచ్చగొట్టి దాడులు చేయించే ప్రమాదం ఉందని, వెంటనే ఆయనకు భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. అలాగే ఢిల్లీలో కూడా ఆయనకు భద్రతను ఏర్పాటు చేయాలని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Read More : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ సీఎం జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
Next Story