- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాజీ సీఎం ఇంటిపై సీబీఐ రైడ్స్.. !

దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్ గఢ్ ( Chhattisgarh ) మాజీ సీఎం భూపేష్ బఘేల్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మాజీ సీఎం భూపేష్ బఘేల్ ( EX CM Bhupesh Baghel) సిబిఐ రైడ్స్ ( CBI Raids) జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో ( Liquor scam ) భాగంగా ఛత్తీస్ గఢ్ ( Chhattisgarh ) మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంట్లో సిబిఐ అధికారులు... రైడ్స్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం నాలుగు గంటల సమయం నుంచే... సిబిఐ సోదాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ కు సంబంధించిన ఇళ్లల్లో... అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు సంబంధించిన రాయపూర్ ( Raipur ) అలాగే బిలాయి లో (Bilai) ఉన్న... నివాసాలలో సిబిఐ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈనెల 10వ తేదీన మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంటిపై ED రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అధికారుల వాహనాలపై కాంగ్రెస్ ( Congress ) కార్యకర్తలు రాళ్లు విసిరి రచ్చ చేశారు. ఆ సమయంలో పరిస్థితి చేతులు దాటి లాఠీ చార్జి వరకు వెళ్ళింది. అయితే తాజాగా సిబిఐ అధికారులు కూడా రంగంలోకి దిగారు. అయితే ఇదంతా కేంద్రంలో ఉండే బిజెపి (BJP) కుట్రలు అంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న... బిజెపి.... ప్రతిపక్షాలను టార్గెట్ చేసి మరీ కేసులు పడుతోందని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంటిపై జరుగుతున్న దాడులను కూడా కాంగ్రెస్ పార్టీ ఖండించింది.