- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అసెంబ్లీలో లగచర్ల ఘటన.. కేటీఆర్ వర్సెస్ శ్రీధర్‌బాబు

దిశ, తెలంగాణ బ్యూరో: లగచర్ల ఘటన, ఫార్మా భూసేకరణ విషయంలో అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వాదం జరిగింది. రైతులను రెచ్చగొట్టి కేటీఆర్, బీఆర్ఎస్నేతలు రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. రైతులను మోసం చేసి బలవంతంగా భూములు తీసుకునేందుకు కుట్రలు చేశారని బీఆర్ఎస్సభ్యులు విరుచుక పడ్డారు. ఇరు పార్టీల సభ్యుల మధ్య కొద్దిసేపు సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేసిన తరువాతే 2027 ఎన్నికల్లో ప్రజలు ముందుకు వెళ్లుతామని, ప్రతిపక్ష నేతలు పదే పదే మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. దశలవారీగా ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటను నేరవేర్చుతామని, దీనిపై విపక్షాలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. లగచర్ల ఫార్మాసిటీ విషయంలో రైతులు భూములు ఇవ్వకుండా కేటీఆర్రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేసేందుకు ఉసిగొల్పారని మండిపడ్డారు. ఏమి తెలియనట్లు ప్రభుత్వం రైతులను ఒప్పించి భూసేకరణ చేయాలని పేర్కొనడం హాస్యస్పదంగా ఉందని, కేసీఆర్ప్రభుత్వంలో ఏవిధంగా రైతులను మోసం చేసేందో ప్రజలకు తెలుసునని సభలో భాగా చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 నుంచి కేసీఆర్ప్రభుత్వం ఏపథకాలు ప్రవేశపెట్టిందో వాటిని బేరీజు వేసుకుని తాము బడ్జెట్ప్రవేశపెట్టామని, ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవన్నారు.
గత కాంగ్రెస్‌పాలనలో గ్రూపు–1 ఉద్యోగాలు భర్తీ చేయగా, మళ్లీ తాము అదికారం చేపట్టిన గ్రూపు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వేసినట్లు చెప్పారు. ఈపరీక్షలు జరగకుండా ప్రతిపక్ష పార్టీ నేతలు అశోక్నగర్వెళ్లి నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ ఉనికి కాపాడుకున్నారని మండిపడ్డారు. తాము పరీక్షల విషయంలో పారదర్శకత పాటించి సకాలంలో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిందాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లుతున్నామని, కేసీఆర్ఏ పథకం చేపట్టిన వాటికి బిల్లు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారని వాటిని తమ ప్రభుత్వం దశల వారీగా చెల్లిస్తుందన్నారు. అనంతరం కేటీఆర్మాట్లాడుతూ భూసేకరణ విషయంలో ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదని, రైతులను బెదిరింపులకు గురిచేయడంతోనే వివాదస్పదంగా మారిందన్నారు. వారితో చర్చలు జరిపి ఫార్మాసిటీతో వచ్చేలా లాభాలను వివరిస్తే బాగుండేందన్నారు. ఇష్టానుసారంగా భూసేకరణ చేయడంతో తాము రైతుల పక్షాన నిలబడ్డామని చెప్పారు.