- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆస్తి పన్ను చెల్లించని యజమానులకు అద్భుత అవకాశం
by Kalyani |

X
దిశ, గజ్వేల్ రూరల్ : ఆస్తి పన్ను చెల్లించని యజమానులకు అద్భుత అవకాశం.. మున్సిపాలిటీల పరిధిలో భారీగా ఆస్తి పన్ను బకాయిలు పడిన వారి కోసం ప్రభుత్వం వన్ టైం సెటిల్‌మెంట్ స్కీంను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024 - 25) కన్న ముందు ఉన్న ఆస్తి పన్ను బకాయిలు ఈనెల 31 లోపు ఒకేసారి చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ తో చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 10 శాతం వడ్డీతో బకాయి మొత్తాన్ని చెల్లించే అవకాశాన్ని మున్సిపల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో పన్నులు చెల్లించి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ధికి పాటుపడాలని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య తెలిపారు.
Next Story