ఎల్ఆర్ఎస్‌ల పరిష్కారంలో గందరగోళం.. గడవు పొడిగించాలని డిమాండ్

by srinivas |
ఎల్ఆర్ఎస్‌ల పరిష్కారంలో గందరగోళం..  గడవు పొడిగించాలని డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలు, ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సభ్యులు కోరారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో గందరగోళం నెలకొందని, రాయితీ గడవును పొడిగించాలని రవీందర్ రావు పేర్కొన్నారు. యూనివర్సిటీ టీచింగ్,నాన్ టీచింగ్ ఉద్యోగులకు టైం స్కేల్ కల్పించాలని అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. తుంగభద్ర, క్రుష్టా నదులు పారుతున్న తమ ప్రాంతానికి సాగునీరందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ‘నేను వైఎస్ఆర్ శిశ్యున్ని..ప్రస్తుతం కేసీఆర్ శిశ్యున్ని..సీఎం రేవంత్ మా ఫ్రెండ్..నీళ్ల కోసం కర్నూల్, కర్ణాటక వాళ్లను అడుకోవాల్సి వస్తుంది. జరా పరిష్కరించండి’ అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్పౌజ్ కేసులను పరిష్కరించాలని ఏవీఎన్.రెడ్డి కోరారు.

ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోదండరాం కోరారు. అంబర్ పేట్ కబేళాలో అక్రమాలు జరుగుతున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని అమీర్ అలీఖాన్ పేర్కొన్నారు. ఎల్ఓసీ జారీచేయడానికి వారం రోజుల సమయం పడుతుందని, దీన్ని24గంటల్లో అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయించి వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తాత మధు సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ గేట్ వద్ద తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటుమ ఆయన వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎల్.రమణ కోరారు. ముదిరాజుల సమస్యల పరిష్కరించాలని బండప్రకాష్ తెలిపారు. రజక భవనానికి ఉప్పల్ భగాయత్ లో భూమి కేటాయించి భవనాన్ని పూర్తి చేయాలని సారయ్య సూచించారు. పిల్లల అక్రమ రవాణను అరికట్టాలని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఎస్.ప్రభాకర్ కోరారు. ట్రస్టులకు ఇచ్చిన భూములను రెగ్యులరైజ్ చేయాలని సురభివాణిదేవి సూచించారు. స్త్రీ నిధి పథకానికి ఐఏఎస్ అధికారిని కేటాయించాలని తీన్మార్ మల్లన్న కోరారు. భవన నిర్మాణ కార్మికులకు భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, ఫీఎఫ్ సౌకర్యం కల్పించాలని సూచించారు.

పిటిషన్స్ సమయంలో…

కోనాకార్పస్ మొక్కల కారణంగా శ్వాసకోస వ్యాధులొస్తున్నాయని, వాటిని తొలగించాలని రఘోత్తంరెడ్డి సూచించారు. మధ్యాహ్నా భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులను చెల్లించాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పాత బకాయిలను 12 వాయిదాల్లో చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, వెంటనే అమలు చేయాలని రవీందర్ రావు కోరారు. జీఓ నెం.317 బాధితుల సమస్యలు పరిష్కరించాలని మల్లన్న కోరారు. కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విఠల్ కోరారు. కాతకాయని అయిల్ ఫామ్ మొక్కలు ఇచ్చి రైతులను మోసం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాత మధు కోరారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కర్నూల్ ఆస్పత్రులు, విజయవాడ ఆస్పత్రులకు వర్తింపజేయాలని వెంకట్రామిరెడ్డి కోరారు.

Next Story

Most Viewed