ఇన్నాళ్లకు నన్ను గుర్తించారు.. వారి ప్రేమను అదృష్టంగా భావిస్తున్నా.. క్రేజీ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2025-03-26 03:53:01.0  )
ఇన్నాళ్లకు నన్ను గుర్తించారు.. వారి ప్రేమను అదృష్టంగా భావిస్తున్నా.. క్రేజీ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కయ్యదు లోహర్ (Kayadu Lohar) పేరే వినిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన ఈ యంగ్ హీరోయిన్ వరుస ప్రాజెక్ట్స్ అందుకుంటూ తన అందంతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అనతి కాలంలోనే అమ్మడు ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకుంది. 2021లో ‘మొగిల్‌పేట’సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కయ్యాదు లోహర్ వివిధ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’(Alluri) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది.

కానీ ఈ చిత్రం హిట్ అందుకోలేకపోయింది. దీంతో కొద్ది కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవల కయ్యదు లోహర్ ‘డ్రాగన్’(Dragon)చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ మూవీ పలు భాషల్లో విడుదలై ఊహించని విధంగా ఘన విజయం సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద రాణించింది. అయితే ‘డ్రాగన్’ చిత్రంతో కయ్యదు లోహర్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఇదయం మురళి,STR 49, ఫంకీ వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కయ్యదు ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘డ్రాగన్ సినిమా తర్వాత లభించిన ఆదరణ అద్భుతంగా ఉంది. దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు నాలోని టాలెంట్‌ను గుర్తిస్తున్నారు. ఈ చిత్రం రాకముందు నేను ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రేక్షకులు సినిమాలో నా పాత్రను ఇష్టపడుతున్నారు. ఇప్పటికీ నన్ను కయ్యదు లోహర్‌గానే గుర్తిస్తున్నారు. ఇది సాధించడం చాలా కష్టం. నేను ఎప్పుడూ కలలు కనే ప్రాజెక్టులు నాకు లభిస్తున్నాయి. ప్రేక్షకుల ప్రేమను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read More..

మహారాణిగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. వావ్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్ల కామెంట్స్



Next Story