హిందూ మతానికి సంబంధించిన కోర్సుపై వివాదం

by John Kora |
హిందూ మతానికి సంబంధించిన కోర్సుపై వివాదం
X

- హిందూఫోబియాను ప్రోత్సహిస్తోందని ఆరోపణ

- నరేంద్ర మోడీ హిందూ ఛాందసవాదిగా చిత్రీకరిస్తున్నారు

- అమెరికాలోని హూస్టన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఫిర్యాదు

దిశ, నేషనల్ బ్యూరో: హిందూ మతంపై అమెరికాలోని హూస్టన్ విశ్వవిద్యాలయం అందిస్తున్న కోర్సు ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఈ కోర్సు హిందూ ఫోబియాను ప్రోత్సహిస్తోందని, భారత రాజకీయ దృశ్యాన్ని వక్రీకరించేలా ఉందని ఒక విద్యార్థి ఫిర్యాదు చేశాడు. కాగా, సదరు విద్యార్థి లేవనెత్తిన అంశాలను సమీక్షిస్తున్నట్లు హూస్టన్ విశ్వవిద్యాలయం తెలిపింది. హూస్టన్ విశ్వవిద్యాలయంలోని లైవ్డ్ హిందూ రిలీజియన్ కోర్సు వివాదానికి దారి తీసింది. ఈ కోర్సును ఆన్‌లైన్‌లో అందిస్తుండగా.. దీనికి సంబంధించిన వీడియో పాఠాలను మైఖెల్ ఉర్రే వారానికి ఒక సారి చెబుతుంటారు. హూస్టన్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ మేజర్‌గా చేస్తున్న హిందూ-అమెరికన్ కార్యకర్త అయిన వసంత్ భట్ ఈ కోర్సుపై కాలేజ్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ డీన్‌కు ఫిర్యాదు చేశాడు.

ప్రొఫెసర్ ఉల్రే ప్రకారం హిందూ మతం ఒక పురాతనమైన, సజీవ సాందప్రదాయం కాదని.. ఒక వలసవాద నిర్మాణమని చెప్పాడు. హిందూ జాతీయవాదులు ఆయుధంగా చేసుకున్న రాజకీయ సాధనమని, ఇది మైనార్టీలపై అణచివేత వ్యవస్థ అని భట్ చెప్పుకొచ్చాడు. హిందూ అనే పదం ఇటీవల కాలంలోనే వచ్చిందని.. అది గ్రంథాలలో కనిపించదని ప్రొఫెసర్ చెప్పినట్లు భట్ పేర్కొన్నాడు. హిందుత్వ, హిందూ‌నెస్ అనేది హిందూ జాతీయవాదులు, హిందూ మతం భారత్‌లో అధికార మతంగా ఉండాలని నమ్మేవారు పేర్కొనే పదం అన్నారు. అంతే కాకుండా ఈ పదాన్ని ఇస్లాంను కించపరచడానికి ఉపయోగిస్తారని సిలబస్‌లో ఉందని భట్ ఆరోపించాడు.

రాజకీయ హిందూయిజం అనే రికార్డింగ్ ఉపన్యాయంలో ప్రొఫెసర్ ఉల్రే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక హిందూ ఛాందసవాదిగా పేర్కొన్నాడని తెలిపాడు. భారతదేశం హిందూ జాతీయవాద రాజ్యం, ఇక్కడ మైనార్టీలను చురుగ్గా అణచివేస్తున్నట్లు ప్రొఫెసర్ పదే పదే పేర్కొంటున్నాడని భట్ అన్నాడు. కోర్సు మెటీరియల్ గురించి ఫిర్యాదు చేస్తూ డీన్‌కు లేఖ రాశానని.. కానీ మతపరమైన అధ్యయన విభాగం నుంచి వచ్చిన ప్రతిస్పందన తన ఫిర్యాదును పరిష్కరించలేదని భట్ తెలిపాడు.

Next Story

Most Viewed