ఐటీ ఉద్యోగులు ఉండే ప్రాంతమే టార్గెట్​గా చేసుకుని చోరీలు...

by Sumithra |
ఐటీ ఉద్యోగులు ఉండే ప్రాంతమే టార్గెట్​గా చేసుకుని చోరీలు...
X

దిశ, కూకట్​పల్లి : ఐటీ ఉద్యోగులు నివాసం ఉంటున్న హాస్టళ్లు, అపార్ట్​మెంట్​లను టార్గెట్​గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగను కేపీహెచ్​బీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్​ రావు, సీఐ రాజశేఖర్​ రెడ్డి, డీఐ రవి కుమార్​లతో కలిసి వివరాలు వెళ్లడించారు. కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కేపీహెచ్​బీకాలనీ ఎల్​ఐజీ ఫేజ్​ 1, 7వ ఫేజ్​లలోని రెండు హాస్టళ్లలో 2 డెల్​, 1 లెనోవ, 1 హెచ్​పీ లాప్​టాప్​లు, సాంసంగ్​ మొబైల్​ ఫోన్​ చోరీ జరిగినట్టు ఈ నెల 23వ తేదీన కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో నిందితుడు జీవ గణేష్​ అలియాస్​ గణేష్ (26)​గా గుర్తించారు. బాలానగర్​ సీసీఎస్​ పోలీసులు, కేపీహెచ్​బీ పోలీసులు గణేష్​ గురించి గాలించడం ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రం, వెల్లూరు గ్రామానికి చెందిన గణేష్ సొంతూరు నుంచి వలస వచ్చి సంగారెడ్డి జిల్లా, పటాన్​ చెరువు ఇస్నాపూర్​లో నివాసం ఉంటు మేస్త్రీగా పని చేసుకుంటున్నాడు.

గణేష్​ నివాసం ఉంటున్న అదే ప్రాంతంలో ఉంటున్న కుమార్​ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఇద్దరు స్నేహితులయ్యారు. ఈ క్రమంలో కుమార్​ గణేష్​తో మేస్త్రిగా పని చేస్తే ఏం లాభం తనతో పాటు ముంబాయికి వస్తే తక్కువ సమయంలో ఎక్కవ డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పిస్తానని చెప్పి తనతో పాటు ముంబాయికి తీసుకు వెళ్లాడు. ముంబాయిలో కుమార్​ గణేష్​కు చోరీలు ఎలా చేయాలో నేర్పించాడు. ఈ క్రమంలో ఇద్దరు ముంబాయిలో లాప్​టాప్​లు చోరీ చేసి కుమార్​కు తెలిసిన తోటనం గ్రామానికి చెందిన రాజేందర్​ అనే వ్యక్తికి విక్రయించే వారు. గత మూడు నెలల క్రితం కుమార్​ అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత గణేష్​ చోరీలు చేసేందుకు హైదరాబాద్​ నగరం అనువైందిగా గుర్తించాడు. కూకట్​పల్లి, కేపీహెచ్​బీ, మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ల పరిధిలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో 2024లో చివరిలో మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. అనంతరం కూకట్​పల్లిలో ఒకటి, కేపీహెచ్​బీలో రెండు చోరీలకు పాల్పడినట్టు ఏసీపీ శ్రీనివాస్​ రావు తెలిపారు.

వరుసగా చోరీలకు పాల్పడుతున్న గణేష్​ గురించి దర్యాప్తు ప్రారంభించిన కేపీహెచ్​భీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి గణేష్​ను అరెస్ట్​ చేశారు. విచారణలో గణేష్​ తాను చేసిన చోరీలను అంగీకరించాడు. చోరీ చేసిన వాటిని రాజేందర్​కు విక్రయించినట్టు గణేష్​ పోలీసుల విచారణలో తెలిపాడు. కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 2 డెల్​ లాప్​టాప్​లు, 1 హెచ్​పి లాప్​టాప్​, 1 సాంసంగ్​ మొబైల్​, కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో 1 ఆపిల్​ లాప్​టాప్​, 1 లెనోవో లాప్​ టాప్​, మియాపూర్​లో 1 లెనొవా, మరో 3 లాప్​టాప్​లు, 1 మొబైల్​ చోరీ చేసినట్టు నేరం అంగీకరించారు. నిందితుడి నుంచి 2 డెల్​ లాప్​టాప్​లు, 2 లెనోవా లాప్టాప్​, 1 హెచ్​పి లాప్​టాప్​, 1 ఆపిల్​ లాప్టాప్​, రెండు మొబైల్​ ఫోన్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ శ్రీనివాస్​ రావు తెలిపారు. కేసును చాక చక్యంగా చేధించినందుకు సిఐ ఎస్​. రాజశేఖర్​ రెడ్డి, డిఐ కే. రవి కుమార్​, డిఎస్సై అబ్దుల్​ సమద్, క్రైం సిబ్బంది నరేందర్​ గౌడ్​, రాజు నాయక్​, రాంచందర్​, సురేష్, రఘురామ్​, జాహెదలను ఏసీపీ శ్రీనివాస్​ రావు అభినందించారు.

చోరీలు జరగకుండా జాగ్రత్తలు పాటించండి: ఏసీపీ శ్రీనివాస్​ రావు..

వేసవి కాలం కావడంతో ప్రజలు తమ ఇంటి తలుపులు తెచిరి పడుకోవడం, హాస్టళ్లలో బ్యాచిలర్స్​ తమ గదుల తలుపులు తెచిరి పడుకోవడం చేస్తుండటంతో దొంగలు చోరీలకు పాల్పడేందుకు సులువు అవుతుంది. తమ విలువైన వస్తువులను బధ్ర పరచుకోవడానికి అన్ని జాగ్రత్తలు పాటించాలని, తలుపులు తెరిచి పెట్టి నిద్రించడం సరికాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story

Most Viewed