Prabhas-Anushka: అభిమానులకు బిగ్ షాక్.. సైలెంట్‌గా పనులన్నీ పూర్తి చేస్తున్న అనుష్క.. ప్రభాస్‌కు జోడీ కాబోతుందా?

by Hamsa |
Prabhas-Anushka: అభిమానులకు బిగ్ షాక్.. సైలెంట్‌గా పనులన్నీ పూర్తి చేస్తున్న అనుష్క.. ప్రభాస్‌కు జోడీ కాబోతుందా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత విక్రమార్కుడు, డాన్, వంటి చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రభాస్(Prabhas), వెంకటేష్, సూర్య, అల్లు అర్జున్(Allu Arjun), నాగార్జున(Nagarjuna), రజినీకాంత్, చిరంజీవి వంటి స్టార్స్‌తో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అంతేకాకుండా లేడీ ఓడియెంటెడ్ సినిమాల్లోనూ నటించిన అనుష్క తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇక ‘బాహుబలి’ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చివరగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం అనుష్క శెట్టి ‘ఘాటి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. అయితే లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతుండగా.. ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ పూర్తి కానందున వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఇక గత కొద్ది రోజుల నుంచి అనుష్క ఎవరికీ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె లావు కావడం వల్ల ‘ఘాటి’ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పనున్నట్లు అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, సోషల్ మీడియాలో పలు పోస్టులు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. అనుష్క చేతిలో ప్రస్తుతం ఏకంగా 7 భారీ ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం. ఇందులో మలయాళంలో 2 , తెలుగులో 3, తమిళంలో 2 చిత్రాలు ఉన్నట్లు టాక్. అయితే ఇందులో ప్రభాస్‌తో కూడా కలిసి నటించే సినిమాలు ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ విషయాలు బయటకు రాకుండా అనుష్క దర్శకనిర్మాతలను రిక్వెస్ట్ చేసిందట. ప్రమోషన్స్‌లోనే తన పాత్రలు రివీల్ అయితే బాగుంటుందని చెప్పడంతో వారు కూడా సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది.

దానికి కారణం ఏంటో తెలియనప్పటికీ అనుష్క చేసిన పని గురించి తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. అస్సలు ఇలా చేస్తుందనుకోలేదని అంటున్నారు. కాగా, ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారంటూ గత కొద్ది కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిపై వీరిద్దరు స్పందించకపోవడంతో రోజు రోజుకు వీరి ప్రేమ వార్తలు ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఏఐ వచ్చినప్పటి నుంచి ఫొటోలను కూడా ఎడిట్ చేసి నెట్టింట పెట్టేస్తున్నారు. పెళ్లి కావడంతో పాటు వారికి పిల్లలు కూడా ఉన్నట్లు క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రభాస్‌తో సినిమా చేస్తుండటంతో అభిమానులు ఆయనకు జోడి కాబోతుందా.. మళ్లీ పెళ్లి వార్తలు జోరందుకుంటాయనే ఈ విషయాలు బయట పడకుండా జాగ్రత్త పడుతుంది కావచ్చు అని చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed