Ap: ఉగాది నుంచి పీ-4 విధానం అమలు

by srinivas |   ( Updated:2025-03-27 16:45:42.0  )
Ap: ఉగాది నుంచి పీ-4 విధానం అమలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఉగాది(Ugadi) నుంచి పీ-4 విధానం(P-4 procedure) అమలు కానుంది. ఈనెల 30న సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ప్రారంభించనున్నారు. ఇందులో బాగంగా కలెక్టర్లు, అధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. సచివాలయం వెనుక 250 ఎకరాల్లో పీ-4 విధానం కార్యక్రమానికి వేదికను ఫిక్స్ చేశారు. దీంతో ఆదివారం సా.5 గంటల నుంచి రా.7 వరకు కార్యక్రమం జరనుంది. 11,500 మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు నోడల్ అధికారి నియమించనున్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ-4 ప్రారంభం కాబోతోంది.

కాగా రాష్ట్రంలో పేదరికాన్ని తరిమికొట్టాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా పీ4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్ విధానంలో పేదలకు ఆర్థిక సాయం చేసి వారిని అభివృద్ధి చేయడమే ఈ విధానం లక్ష్యమని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరో మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు కృష్టి చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సీఎస్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.

Next Story