Nitin Gadgkari : రూ.10 లక్షల కోట్లు.. 25 వేల కిమీల రోడ్లు : నితిన్ గడ్కరీ

by M.Rajitha |
Nitin Gadgkari : రూ.10 లక్షల కోట్లు.. 25 వేల కిమీల రోడ్లు : నితిన్ గడ్కరీ
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో రూ.10 లక్షల కోట్ల వ్యయంతో 25 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను(National High Ways) రెండు లైన్ల నుంచి నాలుగు లైన్లుగా మార్చనున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) గురువారం లోక్‌సభ(Loksabha)లో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. దేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారుల లేన్లను పెంచుతామని వెల్లడించారు. దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులను మరింత విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

అందులో భాగంగాప్రస్తుతం ఉన్నవాటితోపాటు అదనంగా.. రూ.6 లక్షల కోట్లతో 16 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను ఆరులైన్లుగా మార్చే ప్రణాళికను సభలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు(DPR) సిద్ధం అవుతున్నాయని, రానున్న రెండేళ్లలో ఈ పనులు పూర్తి కానున్నాయని తెలిపారు. ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు, ఈ ప్రాజెక్టులు పూర్తయి రోడ్లు వెడల్పు అయితే రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆయన వివరించారు.

Next Story

Most Viewed