Garlic : రోజుకు 2 పచ్చివెల్లుల్లి రెబ్బలు తింటే .. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!

by Prasanna |   ( Updated:2025-03-20 14:58:11.0  )
Garlic : రోజుకు 2 పచ్చివెల్లుల్లి రెబ్బలు తింటే .. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!
X

దిశ, వెబ్ డెస్క్ : మనం చేసుకునే వంటకాలలో వెలుల్లిని ( Garlic ) ఎక్కువగా వాడుతారు. ఇది కూరలకు మంచి రుచిని అందిస్తుంది. అలాగే, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ ఉంటాయి. ఇది కీళ్లనొప్పులను కూడా చెక్ పెడుతుంది. అంతేకాదు, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. మన రోజు వారి డైట్‌లో వెల్లుల్లి తీసుకుంటే .. ఆరోగ్యానికి చాలా మంచిది. దాదాపు అన్ని రకాల వంటల్లో దీనిని ఉపయోగిస్తారు.

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ అల్లిసిన్ ఉంటుంది. దీనిని, మనం తినే ఫుడ్ లో చేర్చుకోవడం వలన మన శరీరాన్ని కాపాడుతుంది. అలాగే, ఇది ప్రాణాంతక గుండె క్యాన్సర్ కి కూడా వ్యతిరేకంగా పోరాడుతుంది.

వెల్లుల్లిని తేనెలో నానబెట్టి తీసుకోవడం వలన పోషకాలు అందుతాయి. దీనిలో అల్లిసిన్, సల్ఫర్ బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తాయి. తేనెలో ఉండే యాక్సిడెంట్ గుణాలు ఆరోగ్యానికి ఏంటో మేలు చేస్తాయి. తేనెలో కలిపి రోజుకొక రెబ్బ ఒకటి తీసుకోవడం వలన కడుపు ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే .. కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది.

వెల్లుల్లి, పసుపు, పాలు కలిపి తీసుకోవడం వలన గుండె ఆరోగ్యానికి మంచిది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. పసుపులో ఉండే కర్కూమీన్‌ కార్డియో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గిస్తుంది. దీంతో, మీ గుండె బలంగా ఉంటుంది. ప్రతి రోజూ రెండు వెల్లుల్లి, మిరియాల పొడి వేసుకుని తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

READ MORE ...

Drink it or not ? : ఎక్కువైతే నష్టం..! తక్కువైతే లాభం!!


Next Story

Most Viewed