- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘట్కేసర్‌లో వర్ష బీభత్సం.. రోడ్డుపై విరిగిపడ్డ చెట్ల కొమ్మలు..
by Aamani |

X
దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ లో శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో వర్షం దంచి కొట్టింది. ఉరుములు మెరుపులతో 40 నిమిషాల పాటు కురిసిన వర్షానికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొండాపూర్ లో చెట్ల కొమ్మలు విరిగి రోడ్ల పైన పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై విరిగిపడ్డ చెట్ల కొమ్మలు తొలగించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎదులాబాద్, అవుషాపూర్, అంకుషాపూర్, మాదారం, మర్పల్లి కూడా ప్రాంతాలతో పాటు పోచారం మున్సిపాలిటీ పరిధిలో మోస్తరుగా వర్షం కురిసింది.
Next Story