- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Naga Chaitanya-Sobhita: అక్కినేని కోడలిపై దారుణ ట్రోల్స్.. ఆ స్టార్ హీరోయిన్‌ను కాపీ కొట్టిందంటూ ఫైర్

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో కొద్ది కాలంపాటు డేటింగ్ చేసి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఇక గత ఏడాది డిసెంబర్ నెలలో ఈ ప్రేమ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. దీంతో శోభిత ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఇక పెళ్లి తర్వాత నుంచి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా శోభిత, నాగచైతన్య తమ మ్యారేజ్ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
నిత్యం పలు ప్రదేశాలకు వెకేషన్స్‌కు వెళ్తూ తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా పలు ఫొటోషూట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇటీవల శోభిత, నాగచైతన్య ‘వోగ్’ కవర్ ఫొటోస్‌కు పోజిలిచ్చారు. ఇందులో స్టైలిష్ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్శించారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో.. శోభిత ధరించిన దుస్తులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో అవి చూసిన వారంతా నెట్టింట దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఆమె బట్టల విషయంలో ఓ స్టార్ హీరోయిన్‌ను కాపీ కొట్టిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అఖ్ల్ బ్రాండ్‌కి చెందిన సిల్వర్ కలర్ టాసెల్, డిటేయిలింగ్ స్లిప్ డ్రెస్ ధరించి సమంత(Samantha)ను కాపీ కొట్టింది. అయితే అక్కినేని కోడలు డ్రెస్ ధర రూ. 49,595కి పైగానే ఉంటుందని టాక్. ఇక ఇలాంటి బట్టలనే గతంలో నాగచైతన్య మాజీ భార్య సమంత కూడా ధరించిన విషయం తెలిసిందే. దీంతో కొందరు నెటిజన్లు శోభితను తిట్టిపోస్తున్నారు. సొంత నిర్ణయం లేకుండా మా సామ్‌ను కాపీ కొట్టినా ఆమెకు సెట్ కాలేదని అంటున్నారు.
Read More..
చిన్నప్పుడే లైంగిక వేధింపుల బారిన పడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య హీరోయిన్.. వీడియో వైరల్