- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముస్లింల రిజర్వేషన్లు తొలగించడం మోదీ తరం కాదు..

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ముస్లింల రిజర్వేషన్లను తొలగించడం ప్రధాని మోదీ తరం కాదని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్టులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్ ను తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ షబ్బీర్ అలీ ఈ విధమైన కామెంట్స్ చేశారు. ముస్లీంల రిజర్వేషన్లను తొలగించడం మోదీ వల్ల కానీ, అమిత్ షా వల్ల కానీ కాదని స్పష్టం ఆయన స్పష్టం చేశారు.
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాడి సాధించుకున్నామని, దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా తమదేనన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అందరినీ కలుపుకొని వెళ్తుందని వ్యాఖ్యానించారు. దీన్ని మతం పేరుతో విడగొట్టబోమని చెప్పారు. హిందూ, ముస్లింలు తనకు రెండు కళ్లలాంటి వారని ఆయనన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేలా, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా ఆవిర్భవించేలా పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ముస్లిం సామాజిక వర్గాలకు షబ్బీర్ అలీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హాందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరాల రత్నాకర్. హారున్. ఖుద్దుస్ తదితరులు పాల్గొన్నారు.
Read More..