- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేపే సన్‌రైజర్స్ మ్యాచ్.. బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 లో భాగంగా 18వ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. అలాగే రెండో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్లు ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో తలపడనున్నాయి. అయితే గత సీజన్లో ఫైనల్ వరకు చేరుకొని రన్నరప్గా నిలిచిన హైదరాబాద్ జట్టు మ్యాచుల కోసం తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 22, 27న జరిగే రెండు మ్యాచుల టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో అందుబాటులో ఉంచగా గంటల వ్యవధిలోనే అన్ని టికెట్లు అమ్ముడు పోయాయి. దీంతో మొదటి మ్యాచ్ చూడాలని ఆశ పడిన వారికి టికెట్లు దొరక్కపోవడంతో భారీ డిమాండ్ ఏర్పడింది.
ఈ డిమాండ్‌ను క్యాచ్ చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు.. బ్లాక్ లో టికెట్లను విక్రయిన్తున్నారు. ఉప్పల్ స్టేడియానికి టికెట్ల కోసం వచ్చి.. వెళ్తున్న వారిని టార్గెట్ గా చేసుకొని భరద్వాజ్ అనే యువకుడు తన వద్ద ఉన్న టికేట్లను అధిక ధరలకు బ్లాక్ టికెట్లు (Black tickets) అమ్ముతున్నాడు. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు భదద్వాజ్ అనే యువకుడిని పట్టుకొని అరెస్ట్ చేశారు. అనంతరం అతని నుంచి నాలుగు టికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా గత సంవత్సరం కూడా ఇలానే ముందుగానే టికెట్లను కొనుగోలు చేసిన కొంత మంది.. బ్లాక్ లో టికెట్లను అమ్ముకునే ప్రయత్నాలు చేయగా.. పోలీసులు వారిని పట్టుకొని బ్లాక్ టికెట్ల దందాను బట్టబయలు చేశారు.