బాబాయ్ కామం.. తల్లితో ఎఫైర్.. బిడ్డకు ప్రెగ్నెన్సీ

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-03-22 07:17:07.0  )
బాబాయ్ కామం.. తల్లితో ఎఫైర్.. బిడ్డకు ప్రెగ్నెన్సీ
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : త‌ల్లిని వ‌ల‌లో వేసుకుని.. బిడ్డ‌కు క‌డుపు చేశాడు ఓ దుర్మార్గుడు. వ‌రుస‌కు మ‌రిద‌య్యే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగించిన మ‌హిళ సొంత కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బ‌లి చేసింది. త‌న సుఖం కోసం సొంత కూతురి జీవితాన్ని ప‌ణంగా పెట్టింది. కామాంధుడి ఆకృత్యానికి చివ‌ర‌కు బాలిక(16) గ‌ర్భం దాల్చింది. మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు ప‌ట్ట‌ణ కేంద్రంలోని అమ్మ ఆస్ప‌త్రిలో శ‌నివారం అబార్ష‌న్ కేసు విచార‌ణ‌లో దారుణాలు వెలుగు చూశాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మ‌హ‌బూబాబాద్ జిల్లా న‌ర్సింహుల‌పేట మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన దంప‌తులు విభేదాల‌తో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. భార్య త‌న కూతురితో క‌లిసి భువ‌న‌గిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలో నివాసముంటోంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు మ‌రిది వ‌రుస‌య్యే రాము అనే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. త‌ల్లిని వ‌ల‌లో వేసుకున్న దుర్మార్గుడు ఈడుకొచ్చిన పిల్ల‌పైనా క‌న్నేశాడు. త‌ల్లి ప్రొద్బ‌లంతో దుర్మార్గుడు ప‌లుమార్లు బాలిక‌పై అత్యాచారం చేయ‌డంతో గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యం ఎవరికి చెప్పుకోవాలో తెలియ‌క స‌ద‌రు బాలిక కొద్దిరోజుల క్రితం అమ్మ‌మ్మ‌కు తెలిపింది. ఈ విష‌యం గుట్టు చ‌ప్పుడు కాకుండా తొర్రూరులోని అమ్మ ప్రైవేటు ఆస్ప‌త్రిలో బాలిక‌కు అబార్ష‌న్ నిర్వ‌హించారు.

బాలిక‌కు అబార్ష‌న్ జ‌రిగిన విష‌యం చైల్డ్‌లైన్‌కు ఫిర్యాదులు అంద‌డంతో అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. విచార‌ణ‌లో త‌ల్లి, ఆమె ప్రియుడి దారుణాలు వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అబార్ష‌న్ నిర్వ‌హించిన ఆస్ప‌త్రి యాజ‌మాన్యంపై, బాలిక‌పై ప‌లుమార్లు అత్యాచారానికి ఒడిగ‌ట్టిన రాము, అందుకు స‌హ‌క‌రించిన బాలిక త‌ల్లిపై అత్యాచారం, పోక్సో కేసుల‌ను న‌మోదు చేసిన‌ట్లు తొర్రూరు సీఐ గ‌ణేష్ దిశ‌కు వెల్ల‌డించారు. బాలిక స్టేట్‌మెంట్ రికార్డు చేయ‌డం జ‌రిగింద‌ని, ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో బాలిక‌కు వైద్యం జరుగుతోంద‌ని మ‌హ‌బూబాబాద్ అడిష‌న‌ల్ సీడీపీవో విజ‌య‌ల‌క్ష్మి దిశ‌కు వెల్ల‌డించారు.

Next Story