- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ

దిశ, పెన్ పహాడ్ : మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ పోరాటంతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ తమ రక్త మాంసాలను ఉడికించి మాదిగ జాతి భవిష్యత్ తరాలకు చిరకాల స్వప్నంగా మిగిలాడని, ఆయన పోరాట ఫలితమే నేటి ఎస్సీ వర్గీకరణ అని ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ అన్నారు. మండల పరిధిలోని ధూపహాడ్ గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్, మండల,గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్సీ వర్గీకరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మందకృష్ణ మాదిగ సుదీర్ఘ కాలం మడమ తిప్పకుండా రాజీలేని పోరాటం చేయడం వల్లనే నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందన్నారు. 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కమిట్మెంట్ కాన్సెప్ట్ గా జాతి ఉద్యమాలను నిర్వహించారని దీని ద్వారానే మందకృష్ణ మాదిగ ప్రభుత్వాల మెడలు వంచి వర్గీకరణ సాధించడం జరిగిందని మందకృష్ణ మాదిగ లేకుంటే ఎస్సీ వర్గీకరణ సాధ్యమయ్యేది కాదని తెలిపారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎస్సీ వర్గీకరణకు సానుకూలం చేసే విధంగా చర్చలు జరిపారని అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేయడంతో మాదిగల 70 ఏళ్ల కల నెరవేరిందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాదిగల కు రిజర్వేషన్ అందిస్తే మందకృష్ణ మాదిగ దళితుల అన్ని కులాలకు వర్గీకరణ ద్వారా అందరికీ సమాన రిజర్వేషన్లు కలిగే విధంగా కృషి చేశారని తెలిపారు. మాదిగల న్యాయమైన పోరాటాన్ని గుర్తించిన ప్రభుత్వాలు వర్గీకరణ చేపట్టినందుకు ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామస్తులకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టి గ్రామంలో ఊరేగింపు నిర్వహించి సంబరాలు చేశారు. గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు మేకల సందీప్ రాజ్ మాదిగలకు సైదమ్మ జ్ఞాపకార్థం డబ్బులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ ములుగూరి రాజు, జిల్లా నాయకులు తిరుమలేష్, మండల అధ్యక్షులు గుగ్గిళ్ళ శ్యాంసన్, గ్రామ శాఖ అధ్యక్షులు గుగ్గిళ్ళ పిచ్చయ్య, గౌరవ సలహాదారు గుగ్గిళ్ళ ఏడుకొండలు, ఉపాధ్యక్షులు మేకల నాగేష్, ప్రధాన కార్యదర్శి మాతంగి సైదులు, కోశాధికారి నన్నెపంగ కిరణ్, గ్రామ పెద్దలు దొంగరి సైదులు, ఆర్తి శ్రీనివాస్, అరవింద్, అంజయ్య, సుధాకర్, అబ్రహం, వెంకన్న, గోవర్ధన్, వినయ్, సతీష్, సంపత్, కె . సతీష్, శ్రీను, సంపత్, లింగయ్య, పుష్ప, మోజెష్, ప్రవీణ్, సైదులు, రవి, జాన్సీ, సైదమ్మా, వెంకటమ్మ, శ్రీలత, ఉమారాణి, రేణుక ముత్తమ్మ, చంద్రకళ వెలిషమ్మ,,శారదా, తదితరులు పాల్గొన్నారు.