HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై రూ. 75 లక్షల జరిమానా విధించిన ఆర్‌బీఐ

by S Gopi |   ( Updated:2025-03-26 13:54:19.0  )
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై రూ. 75 లక్షల జరిమానా విధించిన ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) షాక్ ఇచ్చింది. కేవైసీ నిబంధనలు పాటించని కారణంగా బ్యాంకుకు రూ. 75 లక్షల జరిమానా విధిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. 2023, మార్చి సమయంలో బ్యాంకు కార్యకలాపాలపై ఆర్‌బీఐ సమీక్ష నిర్వహించింది. అందులో వివిధ లోపాలు ఉన్నాయని గుర్తించిన ఆర్‌బీఐ, వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బ్యాంకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో పెనాల్టీ విధించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా 2016లో ఆర్‌బీఐ జారీ చేసిన కేవైసీ మార్గదర్శకాలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పాటించలేదు. బ్యాంకు కస్టమర్లను రిక్స్ ఆధారంగా మిడ్, హై రిస్క్ కేటగిరీలుగా విభజించకపోవడం, ఒక్కో కస్టమర్‌కు ఉండే యూనిక్ కస్టమర్ కోడ్‌ను ఎక్కువ మందికి కేటాయించడం వంటి లోపాలు ఉన్నట్టు ఆర్‌బీఐ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ జరిమానా నియంత్రణాపరమైన ఆదేశాలు పాటించని కారణంగా అమలు చేశామని, దీనివల్ల కస్టమర్ల బ్యాంకింగ్ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్‌బీఐ స్పష్టత ఇచ్చింది.

Next Story