రాష్ట్రంలో నీటి ఎద్దడి.. ప్రభుత్వం కీలక నిర్ణయం

by srinivas |
రాష్ట్రంలో నీటి ఎద్దడి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి(Summer) దృష్ట్యా రాష్ట్రంలో పలుచోట్ల నీటి ఎద్దడి ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో మంచి నీళ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఫోకస్ పెట్టింది. నీటి ఎద్దడి తీర్చేందుకు కృషి చేస్తోంది. గోదావరి(Godavari), కృష్ణా జలాల(Krishna Water)ను అందించేందుకు ప్రయత్నం చేస్తోంది.

ఇందులో భాగంగా ఈ నెల 25, 26న అన్ని కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సమావేశం నిర్వహించారు. 25న కొన్ని జిల్లాలు, 26న మిగిలిన జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏయే ప్రాంతాల్లో నీటి సమస్య ఉందనే అంశాలపై చర్చించనున్నారు. ఈ వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకునేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లకు చంద్రబాబు సూచించనున్నారు. రాష్ట్రంలో పంటలు చివరి దశలో ఉంటటంతో నీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామాలు, పట్టణాలకు నీటి సరఫరాలో నిర్లక్యం ఉండొద్దని చెప్పనున్నారు. ఎక్కడైనా వాటర్ సమస్యలు ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించనున్నారు.

అనంతరం 27వ తేదీన పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)ను సందర్శించనున్నారు. పనులు ఎంత వరకూ వచ్చాయనేది అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ప్రాజెక్టును పరిశీలించి అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం విజయవాడ(Vijayawada)లో జరిగే ఇఫ్తార్ విందు(Iftar Dinner)లో పాల్గొననున్నారు.

Advertisement
Next Story