- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వన్యప్రాణుల మాంసం విక్రయం.. ఎక్కడంటే..?
by Naveena |

X
దిశ, వేములపల్లి :నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శెట్టిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి ఇతర ప్రాంతాల నుంచి నెమలి, దుప్పి మాంసం తీసుకువచ్చి కేజీలుగా ఇతరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో విక్రయ కేంద్రంపై దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఈ మాంసం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారో, ఇందులో ఎంత మంది భాగస్వాములు అయ్యారో వివరాలను రాబడుతున్నట్లు తెలిసింది. కాగా నిందితుడు తో పాటు భాగస్వాములైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story