- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరీంనగర్ పై కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదు

దిశ, తిమ్మాపూర్ : తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన కరీంనగర్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, కరీంనగర్ అభివృద్ధిపై కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం తిమ్మాపూర్ లోని ఆర్టీఏ కార్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రిని విలేకరులు అడిగిన ప్రశ్నలకు పై విధంగా బదులిచ్చారు. మొత్తం మెడికల్ కాలేజీలు సిద్దిపేట, జగిత్యాల, గోదావరి ఖనికి ఇచ్చి కరీంనగర్ కు ఎందుకు ఇవ్వలేదన్నారు. కరీంనగర్ కి సంబంధించి అప్పర్ మానేరు పూర్తి కాకుండానే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ఎందుకు పూర్తయ్యాయని అన్నారు. ఇక్కడి ప్రజలు రాజకీయ పునర్జన్మ ఇస్తే కరీంనగర్, రామగుండం రోడ్డును ఎందుకు 8 లైన్లుగా మార్చలేదని ప్రశ్నించారు. శాతవాహన యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలని ఆనాడే మేం తీర్మానం చేసినా మీ హయాంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
కరీంనగర్ ను లండన్, న్యూయార్క్ లాగా చేస్తామని ఎందుకు చేయలేదన్నారు. పోలీసులు వేధిస్తున్నారని అంటున్నారని, గతంలో భూ ఆక్రమణ కేసులో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఎవరున్నా చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం కోరిందని గుర్తు చేశారు. భూ ఆక్రమణ దారులకు మీరు మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రాజకీయంగా పార్టీ పుట్టింది కరీంనగర్ లోనే అయినప్పటికీ మీరు జిల్లాకు ప్రత్యేకించి చేసింది ఏమిటి అన్నారు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. 25 సంవత్సరాల పార్టీలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పకుండా విజయోత్సవాలు చేస్తారా అని ప్రశ్నించారు. దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలకు డి లిమిటేషన్ లో అన్యాయం జరిగితే ఊరుకుందామా అని బండి సంజయ్ ని ప్రశ్నించారు. 1971 జనాభా లెక్కల ప్రకారం డి లిమిటేషన్ చేయాలని కోరుతున్నామని, లేదంటే ఇప్పుడున్న ఎంపీ స్థానాల ప్రకారం చేయాలని చెబుతున్నామని అన్నారు. రాష్ట్రంలో మరిన్ని ఎంపీ స్థానాలు పెరగాలని డిమాండ్ చేశారు.