శేరిలింగంపల్లిలో భారీ వర్షం.. నదులను తలపించిన కాలనీలు

by Aamani |
శేరిలింగంపల్లిలో భారీ వర్షం..  నదులను తలపించిన కాలనీలు
X

దిశ, శేరిలింగంపల్లి : ఉరుములు, మెరుపులు, గాలి వానతో శుక్రవారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో రాత్రి 11 గంటలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, గాలి దుమారం తగ్గినా అధికారులు, విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తెల్లవారుజామున 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆయా సబ్ స్టేషన్ల సిబ్బంది ఫోన్ బిజీ మోడ్ లో పెట్టి వదిలేశారు. అటు భారీ వర్షానికి పలు కాలనీలలో భారీ ఎత్తున వరద నీరు చేరింది. డ్రైనేజీలలో చెత్త చెదారం చేరడంతో వర్షపు నీరు మొత్తం రోడ్ల మీద ప్రవహించింది. కొండాపూర్ ప్రాంతంలో వర్షపు నీరు నదులను తలపించింది. పలు కాలనీలలో వర్షపు నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. ఇటు శేరిలింగంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద వర్షపు నీరు చేరడంతో అటువైపు నుంచి పోలీసులు దారి మళ్లీంచారు.

Next Story

Most Viewed