- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తేల్చిన సర్వే.. తెలంగాణలో భారీగా పెరిగిన మటన్, చికెన్ ఉత్పత్తి

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ పంటలతో పాటు పాడి, పౌల్ట్రీ రంగాలు భారీ ఉత్పత్తిని నమోదు చేశాయి. మటన్, చికెన్ సైతం గణనీయమైన ఉత్పత్తిని రికార్డు చేశాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గ్రామీణ ప్రాంతంలో పాడి పరిశ్రమ విశేష ప్రగతిని సాధించింది.
బర్రెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు పెంపకం ప్రధాన వృత్తిగా మారింది. వ్యవసాయ ఉత్పత్తి పెరగడంలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ క్రమంగా ప్రగతిని సాధిస్తోంది. పశు సంపద వృద్ధి చెందడంతో చర్మకార పరిశ్రమకు ముడి సరుకు లభిస్తోంది.
పశువులు, గొర్రె మేకల పెంపకం కేవలం పాల అవసరాలను తీర్చడమే కాకుండా, మాంసాహారాలను తీర్చి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. వ్యవసాయంతో పాటు రైతాంగానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోంది. ప్రభుత్వం సామాజిక వర్గాల వారీగా పశు సంపదను పంపిణీ చేసింది. దీంతో వృత్తి కులాల ఆదాయం పెరిగింది. ఉత్పత్తి భారీగా నమోదవుతోంది. మాంసం ఉత్పత్తి పెరగడంతో దిగుమతి తగ్గుముఖం పడుతోంది. గొల్ల కురుమలకు గొర్రెలు, మేకల యూనిట్ల పపిణీతో పాటు ముదిరాజులు, బెస్తలకు చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించింది. సామాజిక వర్గాల వారీగా బర్రెలు, ఆవులు, ఇవ్వడంతో ఉపాధి రంగం మెరుగుపడింది.
