- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చిన శోభిత ధళిపాళ.. పెళ్లైన తర్వాత నీ అందం మరింత పెరిగిపోయిందంటూ నెటిజన్ల కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్(Bollywood0లో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya).. సమంత(Samantha)తో విడాకులు తీసుకున్న తర్వాత అతనితో ప్రేమలో పడింది. అంతేకాకుండా చైతన్యతో చెట్టాపట్టాలేసుకుని వేకెషన్స్, హోటల్స్‌కి కూడా వెళ్ళింది.
అయితే ఆ ఫొటోస్ కాస్తా నెట్టింట బయటపడటంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. కానీ వీరిద్దరూ ఆ విషయం పై స్పందించలేదు. కానీ డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకుని బిగ్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత రీసెంట్‌గా మ్యారేజ్(Marriage) చేసుకుని భార్యా భర్తలు అయ్యారు. ఇక అప్పటినుంచి అక్కినేని కోడలు స్టేటస్‌తో పాటు భర్తతో ఎంజాయ్ చేస్తుంది శోభిత. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా శోభిత తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఆమె కుంభకోణంలోని రామస్వామి టెంపుల్‌ను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. అయితే గుడికి వెళ్తున్నది కాబట్టి ట్రెడిషనల్ వేర్‌లో దర్శనమిచ్చి అందరినీ ఫిదా చేసింది. ఇక వాటికి మ్యాగ్నిఫికెన్స్ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు గార్జియస్, మ్యారెజ్ అయ్యాక మీకు అందం మరింత పెరిగిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.
Read More..