- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇఫ్తార్ కు వెళ్లి వస్తూ ప్రమాదానికి గురైన తాత మనవరాలు..
by Sumithra |

X
దిశ, కోదాడ : ఆటో కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ వై జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ హుస్సేన్ కొమరబండలోని శ్రీ కృష్ణ హోమ్స్ లో నివాసం ఉంటూ ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం ఒక్క పొద్దులు ముగించుకొని తన ఇంటికి వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న కారు ఢీ కొడంతో హుస్సేన్ తో పాటు తన మనవరాలు షేక్.అస్సాన్ కి తీవ్ర గాయాలయ్యాయి. తన ముగ్గురు మనవరాలిని ఎక్కించుకొని వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు వారిని తరలించారు.
Next Story